VIDEO: శోభాయాత్రలో విషాదం.. యువకుడు మృతి

VIDEO: శోభాయాత్రలో విషాదం.. యువకుడు మృతి

HNK: ఖాజీపేట దర్గా ప్రాంతంలో శివాజీ శోభాయాత్ర కోసం ఏర్పాట్లు చేస్తుండగా బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. శోభాయాత్రలో భాగంగా ఐరన్ పైపులను పైకి లేపుతున్న సమయంలో అవి 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలాయి. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.