VIDEO: వాంఖడేలో 'మెస్సీ' మేనియా

VIDEO: వాంఖడేలో 'మెస్సీ' మేనియా

వాంఖడే స్టేడియం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నామస్మరణతో మారుమోగుతోంది. మరికాసేపట్లో మెస్సీ ఈ స్టేడియానికి రానున్నాడు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి చేరుకుని, 'మెస్సీ.. మెస్సీ' అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే, మెస్సీతో పాటు కోహ్లీ కూడా స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చారిత్రక క్షణం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.