INSPIRATION: సచిన్ టెండూల్కర్
అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా సచిన్ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన చూపిన పట్టుదల, క్రమశిక్షణ ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శం. క్రీడారంగంలో చేసిన కృషికి గానూ 'భారతరత్న' అందుకున్న తొలి క్రీడాకారుడిగా నిలిచారు. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఆయన జీవితం నిరూపిస్తుంది.