'పాఠశాల భవన నిర్మాణం వేగవంతం చేయాలి'

'పాఠశాల భవన నిర్మాణం వేగవంతం చేయాలి'

శ్రీకాకుళంలోని ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి అధికారులకి పలు సూచనలు చేశారు. పాఠశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు.