ఆటోనగర్ టెర్మినల్ వద్ద దెబ్బతిన్న రోడ్డు

ఆటోనగర్ టెర్మినల్ వద్ద దెబ్బతిన్న రోడ్డు

NTR: విజయవాడ ఆటోనగర్ బస్సు టెర్మినల్ పక్కన ఉన్న రోడ్డు అప్రోచ్ సక్రమంగా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బందర్ రోడ్డు నుంచి రామవరపాడు వరకు విస్తరించి ఉండే ఈ మార్గంలో, ముఖ్యంగా బందర్ రోడ్డు కలిసే ప్రాంతంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కనీస మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.