కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ
SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో ఇవాళ జరిగిన కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, బర్దిపూర్ అప్పాజీ పాల్గొన్నారు. వీరికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శివ రుద్రప్ప, ఛైర్మన్ చంద్రశేఖర్ ఘనంగా స్వాగతించారు. అనంతరం ఇక్కడ జరిగిన స్వామి వారి కళ్యాణం వీక్షించి, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.