రాజీవ్ పార్కు సమస్యలను పట్టించుకోని అధికారులు

SRD: సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్కును అధికారులు పట్టించుకోవడంలేదని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి ఆరోపించారు. సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్కులోని సమస్యలను ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.