మిస్సింగ్ కేసుని ఛేదించిన పీఎం పాలెం పోలీసులు

మిస్సింగ్ కేసుని ఛేదించిన పీఎం పాలెం పోలీసులు

VSP: పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి విషయమై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే స్పందించారు. విస్తృతంగా గాలింపు నిర్వహించి సాంకేతిక సహాయంతో ఆమెను మంగళవారం గుర్తించారు. అనంతరం యువతిని కుటుంబ సభ్యుల చెంతకు క్షేమంగా చేర్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి పీఎం పాలెం సిబ్బందిని ప్రశంసించారు.