'ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివి'
MLG: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివని BRS జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. ఏటూరునాగారం మండల ఉద్యమకారుల అధ్యక్షునిగా ఎన్నికైన సప్పిడి రాంనర్సయ్య, నూతన కమిటీ సభ్యులను లక్ష్మణబాబు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర సాధనకోసం 2001 నుంచి సాగిన మలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన యోధులకు సముచిత గౌరవం దక్కాలని కోరారు.