'గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి'
SRCL: గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య సేవలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, నవజాతి శిశువుల మరణాలు జిల్లాలో జరగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్కువ ప్రసవాలు అయ్యేలా వైద్యులు శ్రద్ధ పెట్టాలన్నారు.