నర్సింగ్ హోమ్ ముందు బాధితుల ఆందోళన

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఈనెల 17న ప్రసవం కోసం వచ్చిన రామంచ ఎస్తెర అనే బాలింత ప్రసవ సమయంలో అస్వస్థతకు గురై హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని బుధవారం బాధితురాలి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు.