ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

NRML: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఏదైనా సమస్య వస్తే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132కు కాల్ చేయాలని తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు.