రహదారి గుంతలో నీరు తొలగింపు
W.G: మొంథా తుఫాను వర్షాలతో మొగల్తూరు నుంచి వెంప వెళ్లే ఆర్అండ్ రోడ్డు గుంతల్లో నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీనిపై స్పందించిన కొత్తపాలెం మాజీ సర్పంచ్ మైలబత్తుల రాంబాబు, కూలీలను ఏర్పాటు చేసి రోడ్డుపై నీటిని తొలగించారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.