VIDEO: వర్ధన్నపేటలో తాత్కాలిక మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు చర్యలు
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ఇవాళ వర్ధన్నపేట పాత మున్సిపాలిటీ భవనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు చేసిన మున్సిఫ్ కోర్టును తాత్కాలికంగా ఈ భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జీవో ద్వారా భవనం అప్పగించడంతో, అవసరమైన మరమ్మతులు త్వరగా పూర్తి చేసి కోర్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా జడ్జికి ఆదేశించారు.