ఉరేసుకొని బాలిక ఆత్మహత్య

ELR: జంగారెడ్డిగూడెంలో బుధవారం ఇంటర్ పూర్తి చేసిన (16) బాలిక ఉరేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు మధ్య విభేదాలతో వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో కుమార్తె అమ్మమ్మ ఇంటి వద్ద ఇంటర్ చదువుతోంది. అయితే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే తన మృతితో నైనా తల్లిదండ్రులు కలిసి ఉండాలని ఆమె లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.