VIDEO: దారుణం.. 36 మందిపై పిచ్చికుక్క దాడి
RR: ఆమనగల్ పట్టణంలో పిచ్చి కుక్క వీర విహారం చేసింది. స్థానికుల వివరాలు.. ప్రధాన రహదారిపై రద్దీగా ఉండే ప్రదేశంలో ఓ కుక్క కనిపించిన వారందరిపై దాడి చేసి కరిచింది. ఏకంగా 36 మందిని కరవగా గాయాలైన వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. కుక్క కాటుకు గురైన 36 మందికి చికిత్స అందించామని వైద్యులు తెలిపారు.