వినాయక చవితి శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

BDK: వినాయక చవితిని శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసులో నేరస్తులకు శిక్ష పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని, విచారణలో జాప్యం తగదని స్పష్టం చేశారు.