'జిల్లాలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'
ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో రేపు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలని, గతంలో దరఖాస్తు చేసిన వారు రశీదు తీసుకురావాలని కలెక్టర్ కోరారు.