రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

KRNL: ఆస్పరి మండల కేంద్రంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తికొండకు వెళ్లే ప్రధాన రహదారిలో ఆటో - బైక్ ఢీకొనగా ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు కోసిగి మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.