హాంకాంగ్‌ ప్రమాదం.. 83కు చేరిన మరణాలు

హాంకాంగ్‌ ప్రమాదం.. 83కు చేరిన మరణాలు

హాంకాంగ్‌లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 83కు చేరింది. 76 మందికి గాయాలు కాగా, 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 280 మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక మంది ఇంకా భవనాల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 304 ఫైర్‌ఇంజిన్లు, రెస్క్యూ వాహనాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.