ప్రధానిపై రాహుల్ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరోసారి PM మోదీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోనే మోదీ బీహార్‌కు వచ్చి ప్రసంగాలు చేస్తారని.. ఎన్నికల తర్వాత రాష్ట్రం వైపు తిరిగి చూడరని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువత ప్రశ్నించకుండా వారు రీల్స్ చూడాలని మోదీ కోరుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఉత్తమ విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.