'రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం'
ప్రకాశం: సింగరాయకొండలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై సర్కిల్ సీఐ హజరతయ్యా రోడ్డు ప్రమాదాలపై శనివారం ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రమాదం జరిగితే తలకు బలమైన గాయం తగిలి మృతి చెందే అవకాశం ఉందన్నారు. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి రక్షణ కల్పించుకోవాలని ఆయన సూచించారు.