ప్రమాదకర గుంతలు.. ప్రయాణికులకు ముప్పు

JGL: సారంగాపూర్ మండలం పోతారం నుంచి రేచుపల్లి వెళ్లే మార్గంలో వర్షాలకు రోడ్డు కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. పిచ్చి మొక్కలు ఉండటంతో దగ్గరికి వచ్చే వరకు గుంత కనిపించడం లేదు. రాత్రి వేళల్లో వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదకర పరిస్థితి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డు బాగు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.