దోర్నాల హరి బాబుకు మహానంది పురస్కారం

దోర్నాల హరి బాబుకు మహానంది పురస్కారం

NLR: నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ హాస్యనటుడు దోర్నాల హరిబాబుకు "మహానంది" పురస్కారం వరించింది. ఆదివారం హైదరాబాద్ పట్టణంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం పురస్కరించుకుని ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో హరిబాబుకు మహానంది పురస్కారాన్ని అందజేశారు. రంగస్థలం, టీవీ, సినిమా రంగాలలో హాస్య కళాకారుడిగా దోర్నాల హరిబాబు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు.