రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించాలి: రవీందర్
MHBD: రాష్ట్ర బడ్జెట్‌లో గొర్రెల, మేకల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని GMPS రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడ (M) లోని పూసల భవన్‌లో జరిగిన జిల్లా 3వ మహాసభలో పాల్గొని మాట్లాడారు. దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండవ విడత గొర్రెల పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, తదితరులు ఉన్నారు.