VIDEO: వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు పోలీసులు చేయూత

VIDEO: వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు పోలీసులు చేయూత

MHBD: మూడో విడత పోలింగ్ సందర్భంగా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో బుధవారం ఆదర్శవంతమైన దృశ్యం కనిపించింది. వీల్‌ ఛైర్‌లో ఉన్న వృద్ధులు, దివ్యాంగ ఓటర్లను పోలీసులు పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించారు. మూడు కిలోమీటర్ల కాలినడకన వచ్చి ఓటు హక్కు వినియోగించిన చిట్యాలగడ్డ ఓటర్లకు పోలీసులు మానవత్వం చాటారు.