విజయవాడలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

NTR: విజయవాడలో కలెక్టర్ లక్ష్మీ శ, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీ శ స్వాతంత్య్ర ఔన్నత్యం భవిష్య తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు.