నల్లగొండ బీజేపీ కార్యాలయంలో సంబరాలు

NLG: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్లగొండ బీజేపీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు వీరెల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీపై నమ్మకం ఉంచి ప్రజలు ఘనవిజయాన్ని అందించారని వారు అన్నారు.