మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMM: బోనకల్ మండలం రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంగళవారం మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.