మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

W.G: నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు శనివారం రూరల్ సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ నెల 13న ఒంటరిగా ఇంట్లో ఉన్న 9 ఏళ్ల మైనర్ బాలికను కుడుపూడి నాగబాలాజీ తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలిపారు. డీఎస్పీ శ్రీవేధ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.