విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం
BHNG: రాజాపేట మండలం దూది వెంకటాపురంలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉచిత కరెంట్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంజూరు చేసినట్టు తెలిపారు.