సామెత - దాని అర్థం
సామెత: 'కందకు లేని నొప్పి కత్తి పీటకెందుకు'
అర్థం: అనవసరంగా జోక్యం చేసుకునే వారిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. కందగడ్డను కోసేటప్పుడు కోసేవారికో, ఆ గడ్డకో దురద పుట్టాలి కానీ, కోసే కత్తిపీటకి ఎందుకు పుడుతుంది? అంటే.. సమస్య ఉన్నవారికి లేని బాధ, సంబంధం లేని మూడో వ్యక్తికి ఎందుకు అని దీని అర్థం. ఇతరుల విషయాల్లో తలదూర్చే వ్యక్తులను విమర్శించడానికి ఈ సామెతను వాడతారు.