'పీఎం ధనధాన్య కృషి యోజన'తో రైతులకు మేలు

'పీఎం ధనధాన్య కృషి యోజన'తో రైతులకు మేలు

NRPT: ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరమని డైరెక్టర్ పొన్న స్వామి తెలిపారు. ఆయిల్ ఫాం, పండ్ల తోటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ యంత్రాలతో పాటు రుణాలు అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.