మేడే సందర్భంగా CITU ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు
ASF: సిర్పూర్ (టి) మండలం భూపాలపట్నం ప్రాథమిక పాఠశాలలో మేడే సందర్భంగా CITU ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం క్రీడా పోటీలు నిర్వహించారు. కుర్చీ ఆట, చెంచా ఆట, సూదిదారం వంటి ఆటల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని CITU గ్రామ కమిటీ కన్వీనర్ దుర్గయ్య, కో-కన్వీనర్ ప్రమీల, సమన్వయం చేశారు. వారు మాట్లాడుతూ.. విజేతలకు బహుమతులు మేడే రోజు అందజేస్తామన్నారు.