కాలనీల స్థల పరిశీలన వేగవంతం చేయాలి: కలెక్టర్

ASR: పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు కాలనీలు నిర్మించడానికి రంపచోడవరం, రాజవొమ్మంగి మండలాల్లో స్థల పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. గుర్తించిన స్థలాలు గృహ నిర్మాణాలకు అనువుగా ఉన్నది, లేనిదీ పరిశీలించాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో వీసీ నిర్వహించారు. అవసరమైన చోట భూమికి బదులు భూమి ఇవ్వటానికి అవకాశాలు పరిశీలించాలన్నారు.