చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
GDWL: వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ధరూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ డీ.ఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనియమని అన్నారు.