ఈనెల 23న రైతు సంఘం మూడవ మహాసభలు
SRPT: కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు కోరారు. ఈరోజు కోదాడ పట్టణంలో రైతు సంఘం జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.