సీఎంను కలిసిన జిల్లా తెలుగు యువత అధ్యక్షులు

ELR: సీఎం నారా చంద్రబాబును ఉంగుటూరు గ్రామానికి చెందిన జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి సూర్య చంద్ర రావు సోమవారం కలుసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని బయోడేటా సీఎంకు అందజేశారు. ఆది నుంచి టీడీపీ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నానని, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడ్డానని ఆయనకు రెడ్డి వివరించారు.