ముడుసల్లోవా నీటి సమస్యపై సీపీఐ ఆందోళన
ASR: ముడుసల్లోవా తాగునీటి సమస్యపై సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు విషయం వివరించగా.. ఏఈ శ్రీనివాస్ను పరిశీలనకు పంపించారు. రిజర్వాయర్లో మురుగు, వ్యర్థాలు కలవడంతో నీరు కలుషితం అవుతోందని ఆయన తెలిపారు. డయేరియా వంటి వ్యాధుల ప్రమాదం ఉందన్నారు.