తాగునీటి ఎద్దడి నివారణకు ఎంపీ కీలక నిర్ణయం

తాగునీటి ఎద్దడి నివారణకు ఎంపీ కీలక నిర్ణయం

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నిధుల నుంచి రూ. 35 లక్షలు మంజూరు చేయడంతో, జిల్లాలోని 44 గ్రామాల్లో కొత్త చేతిపంపులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. వారం రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేయాలన్నారు.