భూసేకరణపై నిరసన.. సీపీఐ నాయకుల అరెస్ట్
VKB: పరిగి నియోజకవర్గంలోని కడ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1200 ఎకరాల భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ సదరు రైతులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ నేతలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పిర్ మొహమ్మద్, రైతు సంఘం నేత సురేశ్ కుమార్‌లను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.