'భూగర్భ జలాలను పొదుపుగా వాడుకోవాలి'
SRPT: తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామ రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ నీటి దినోత్సవం పురస్కరించుకొని నీటి వినియోగంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులు మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పొదుపుగా వాడుకుంటూ కాలుష్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.