కాప్రా చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

కాప్రా చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

MDCL: కాప్రా చెరువును ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి గురువారం పరిశీలించారు. అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ కాప్రా చెరువును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.