ఇరాన్‌పై ఖతార్ ప్రధాని ఆగ్రహం
ఇరాన్‌పై ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రికి ఆయన ఫోన్ చేశారు. పొరుగు దేశాలను యుద్ధంలోకి లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సంబంధం లేని యుద్ధంలోకి తమను లాగడం సరికాదని మండిపడ్డారు. తక్షణమే దాడులను ఆపాలని డిమాండ్ చేశారు.