'యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది'
HNK: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.