శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలన
NGKL: శ్రీరామనవమి పండగ సందర్భంగా పట్టణంలోని రామస్వామి టెంపుల్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో చేపడుతున్న భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.