VIDEO: రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు
NLR: మొంథా తుఫాన్ ప్రభావంతో కావలిలో జోరు వాన కురుస్తుంది. కావలి పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చెట్టును తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.