స్వరాజ్యంకై తూపాకీ పట్టిన 'స్వరాజ్యం'

స్వరాజ్యంకై తూపాకీ పట్టిన 'స్వరాజ్యం'

SRPT: మల్లు స్వరాజ్యం(1931-2022 మార్చి 19) తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన కమ్యూనిస్టు నాయకురాలు. ఆమె తుంగతుర్తి(మం), కర్విరాల కొత్తగూడెంలో జన్మించారు. గాంధీజీ స్వరాజ్ ఉద్యమం స్ఫూర్తితో కుటుంబ సభ్యులు ఆమె పేరును 'స్వరాజ్యం' అని పెట్టారు. 16 ఏళ్లకే తుపాకీ చేతబట్టి, సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం, రజాకార్లు, జమీందారులు, దొరల దురాగతాలకు వ్యతిరేకంగా దళాలను నడిపించారు.