విద్యుత్ శాఖలో భారీ పెట్టుబడులు

విద్యుత్ శాఖలో భారీ పెట్టుబడులు

TG: ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్‌లో భారీ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యుత్ శాఖలో ఇవాళ ఒక్కరోజే రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు జరిగాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులలో పెట్టుబడులకు వ్యాపారస్తులు ముందుకొచ్చారు. మైహోమ్ పవర్ సంస్థ రూ. 7 వేల కోట్లకు MOU కుదుర్చుకుంది. దీని ద్వారా 12,500మందికి ఉద్యోగాలు రానున్నాయి.