VIDEO: ప్రమాదానికి గురైన పెళ్లి బృందం కారు
RR: పెళ్లి బృందం కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన చేవేళ్లలోని దేవుని ఎర్రవల్లి స్టేజి వద్ద జరిగింది. ప్రధాన రహదారిపై బ్రేక్ డౌన్ అయిన వాహనాన్ని JCBతో పక్కకు జరుపుతుండగా, వేగంగా వచ్చిన పెళ్లి కారు ఒక్కసారిగా JCBని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న వారికి గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.